వెంకీ లిస్ట్ లో మరో ఇద్దరు ?

Wednesday,August 30,2017 - 11:16 by Z_CLU

ఇటివలే ‘గురు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ ఈ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా నెక్స్ట్ సినిమాపై నో క్లారిటీ అంటున్నాడు. ఆ మధ్య వెంకీ నెక్స్ట్ సినిమాకు పూరి జగన్నాథ్ తో పాటు క్రిష్ పేరు కూడా వినిపించగా ఇప్పుడు మరో ముగ్గురు పేర్లు వెంకీ లిస్టు లోకి చేరాయి. లేటెస్ట్ గా గుణ శేఖర్ వెంకీ కోసం ఓ హిస్టారికల్ స్టొరీ సిద్దం చేశాడని, ఈ స్క్రిప్ట్ వెంకీ కి కూడా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచేశాడనే టాక్ వినిపిస్తుంది.


అయితే గుణతో పాటు మరో ఇద్దరు దర్శకుల పేర్లు కూడా ప్రెజెంట్ వెంకీ నెక్స్ట్ సినిమాకు వినిపిస్తుండడంతో దగ్గుబాటి ఫాన్స్ కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఇంతకీ వెంకీ లిస్టు లో వినిపిస్తున్న ఆ దర్శకులు మరెవరో కాదు బొమ్మరిల్లు భాస్కర్, తేజ.. ‘ఒంగోలు గిత్త’ సినిమా తర్వాత తమిళ్ లో ‘బెంగుళూర్ నాటకాల్’ సినిమాకు దర్శకత్వం వహించిన భాస్కర్ వెంకటేష్ తో ఓ మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని ఇందులో వెంకీ తో కలిసి విజయ్ దేవరకొండ నటిస్తాడనే టాక్ వినిపిస్తుంది..  రీసెంట్ గా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో రానా తో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తీసి సూపర్ హిట్ అందుకొని మళ్ళీ ఫాం లోకోచ్చిన తేజ కూడా వెంకటేష్ కోసం ఓ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాడని ఈ సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పైనే తెరకెక్కనుందనే వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఈ ముగ్గురిలో వెంకీ తన 75 వ సినిమాకు ఏ డైరెక్టర్ ను సెలెక్ట్ చేసుకుంటాడో..తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..