వెంకటాపురం రిలీజ్ కి రెడీ

Thursday,May 04,2017 - 05:46 by Z_CLU

హ్యాప్పీడేస్ ఫేమ్ రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించిన యూత్ ఫుల్ థ్రిల్లర్ ‘వెంకటాపురం’ రిలీజ్ కి రెడీ అయింది. ఫస్ట్ లుక్ రిలేజ్ అయినప్పటి నుండి సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిన సినిమా యూనిట్, ఆ తరవాత  రిలీజైన టీజర్స్, ట్రేలర్స్ తో పాటు ఆడియో జ్యూక్ బాక్స్ సోషల్ మీడియాలో మ్యాగ్జిమం స్పేస్ ని క్రియేట్ చేసుకోవడం లో సక్సెస్ అయింది.

వేణు దర్శకత్వంలో మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మే 12 న రిలీజ్ కి రెడీ అవుతుంది. అచ్చు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని శ్రేయాస్ తుము మరియు ఫణి కుమార్ సంయుక్తంగా నిర్మించారు. డిఫెరెంట్ కంటెంట్ తో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.