వెంకీ , వరుణ్ తేజ్ మొదలెట్టేసారు

Saturday,June 23,2018 - 11:20 by Z_CLU

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘F2 ఫన్ & ఫ్రస్ట్రేషన్’ సినిమా ఈరోజే లాంచ్ అయింది. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో హిలేరియస్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ ఆఫీస్ లో ఉదయం ప్రారంభమైంది. అల్లు అరవింద్  ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ నిచ్చారు.

జూన్ 30 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకోనుంది. మొదటి షెడ్యుల్ లో వెంకటేష్ పై కొన్ని కీలక సనివేశాలు తెరకెక్కించనున్నారు. జులై నుండి వరుణ్ ఈ సినిమాలో జాయిన్ అవుతాడు. వెంక‌టేష్ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు.