ఈ ఏడాది రెండు సినిమాలు పక్కా

Friday,January 03,2020 - 10:02 by Z_CLU

గతేడాది కొందరు దర్శకుల నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. అందులో సతీష్ వేగేశ్న కూడా ఉన్నారు. సతీష్ నుండి లాస్ట్ ఇయర్ సినిమా రాకపోవడం ఫ్యామిలీ ఆడియన్స్ ను నిరాశపరిచింది. అయితే ఈ ఏడాది మాత్రం తన నుండి రెండు సినిమాలు పక్కా అంటున్నాడు. ఇటివలే ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు ఫ్యామిలీ డైరెక్టర్.

“జనవరి 15న సంక్రాంతి కానుకగా ‘ఎంత మంచి వాడవురా’ రిలీజ్ అవుతోంది. తదుపరి సినిమాకు కథలు రెడీగా ఉన్నాయి. ఫిబ్రవరి లేదా మార్చ్ నుండి తదుపరి సినిమా సెట్స్ పైకి తెచ్చే ఆలోచనలో ఉన్నాను. ఈ ఏడాది డిసెంబర్ లోపే మరో సినిమా రిలీజ్ అవ్వడం ఖాయం. ఈ ఇయర్ రెండు సినిమాలు రిలీజ్ పక్కా ” అని అన్నారు. సో ఫ్యామిలీ డైరెక్టర్ ఈ ఇయర్ రెండు సినిమాలతో ప్రేక్షకులకు వినోదం పంచనున్నారన్నమాట.