Vedalam Remake - మరో ఆల్టర్నేట్
Wednesday,October 14,2020 - 05:48 by Z_CLU
ఆచార్య సినిమా తర్వాత Vedalam Remake సెట్స్ పైకి వస్తుందనేది దాదాపు ఫిక్స్ అయింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం సాయిపల్లవిని తీసుకున్నారనే టాక్ కూడా వచ్చింది. అయితే ఎందుకైనా మంచిదని ఇప్పుడు సాయి పల్లవికి ఆల్టర్నేట్ గా కీర్తిసురేష్ (Keerthy Suresh) ను కూడా పైప్ లైన్లో పెట్టారు.
ఖైదీ నంబర్ 150 నుంచి హీరోయిన్ల విషయంలో Chiranjeevi ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరికి ఆచార్యలో కూడా త్రిష అనుకుంటే, ఆఖరి నిమిషంలో ఆమె తప్పుకుంది. దీంతో మళ్లీ కాజల్ నే రిపీట్ చేయాల్సి వచ్చింది. వేదాళం రీమేక్ కు ఆ సమస్య తలెత్తకుండా ఇలా ఒకరికి ఇద్దర్ని సిద్ధం చేసి పెడుతున్నట్టు టాక్.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో జ్యూసీ అప్ డేట్ ఏంటంటే.. నవంబర్ నుంచే ఈ సినిమాను స్టార్ట్ చేస్తారట. చిరంజీవితో సంబంధం లేని సన్నివేశాల్ని షూట్ చేస్తారట.