లైఫ్ టైమ్ కామెడీ చేసేశా – వరుణ్ తేజ్

Friday,January 11,2019 - 12:56 by Z_CLU

రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది ‘F2’. పండక్కి కడుపు నిండా కామెడీ గ్యారంటీ అని ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తో కన్ఫమ్ చేసేశారు మేకర్స్. దానికి తోడు సూపర్ కాన్ఫిడెంట్ గా చేస్తున్న అగ్రెసివ్ ప్రమోషన్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీ జెనెరేట్ చేస్తున్నాయి.

రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో వరుణ్ తేజ్ సినిమాలో తన క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. దాంతో ‘F2’ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే లెవెల్ లో ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ జెనెరేట్ అవుతుంది.

‘వెంకటేష్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనగానే కొంచెం నర్వస్ గా ఫీలయ్యా.  నాకూ ఎప్పటి నుండో ఇలాంటి హిలేరియస్ రోల్ ప్లే చేయాలనే కోరిక ఉండేది. కానీ అనిల్ రావిపూడి మాత్రం, నేను నా లైఫ్ టైమ్ లో చేయగలిగిన కామెడీ అంతా ఈ ఒక్క సినిమాలో చేయించేశాడు.’ అని చెప్పుకున్నాడు ఈ మెగా హీరో.

ఒక బయోపిక్ తో, 2 మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ మధ్య కావాల్సినంత కామెడీ తో రేపు రిలీజవుతున్న F2, ఈ సంక్రాంతిని మరింత స్పెషల్ చేయనుంది.