చరణ్, ఎన్టీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన వరుణ్

Tuesday,September 24,2019 - 03:14 by Z_CLU

గద్దలకొండ గణేష్/వాల్మీకి థియేటర్లలోకి వచ్చేసింది. డీసెంట్ టాక్ తో నడుస్తోంది. ఈ సినిమాకు రామ్ చరణ్ కు ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఈ సినిమాకు ఎన్టీఆర్ కు కూడా ఎలాంటి కనెక్షన్ లేదు. అయినప్పటికీ చరణ్, ఎన్టీఆర్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాడు హీరో వరుణ్ తేజ్. దీనికి ఓ కారణం ఉంది.

వాల్మీకి సినిమాకు ఆఖరి నిమిషంలో టైటిల్ మార్చేశారు. గద్దలకొండ గణేష్ గా పేరుపెట్టారు. క్షణాల మీద ఓ పోస్టర్ చేసి రిలీజ్ చేశారు. దర్శకుడు, నిర్మాత అంతా బిజీగా ఉన్నారు. ఆ టైమ్ లో తనకు బాగా టెన్షన్ వచ్చేసిందని, ఏం చేయాలో అర్థంకాక చరణ్ కు ఫోన్ చేశానని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. అప్పుడు అదే సిచ్యుయేషన్ లో ఎన్టీఆర్ కూడా ఉన్నాడని.. వాళ్లిద్దరి మాటలు తనకు బాగా హెల్ప్ అయ్యాయని అంటున్నాడు వరుణ్.

“నాకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఫస్ట్ ఫోన్ చేసేది చరణ్ అన్నకే. వెంటనే ఫోన్ చేశాను. టైటిల్ మార్చేస్తానంటున్నారు టెన్షన్ గా ఉందని చెప్పాను. ఇంటికి రమ్మని చెప్పాడు. ఇంటికి వెళ్లగానే చరణ్ అన్న, ఎన్టీఆర్ గారు కూర్చొని కాఫీ తాగుతున్నారు. ఆరోజు నా ఒత్తిడి మొత్తాన్ని హై పాయింట్ నుంచి జీరోకు తీసుకొచ్చిన వ్యక్తులు చరణ్ అన్న, ఎన్టీఆర్ గారు మాత్రమే. ఆరోజు వాళ్లిద్దరూ చెప్పిన మాటలు నాకు చాలా హెల్ప్ అయ్యాయి. టెన్షన్ బాగా తగ్గింది. వాళ్లిద్దరికీ థ్యాంక్స్.”