వాల్మీకి రిలీజ్ డేట్ ఫిక్స్

Monday,June 10,2019 - 12:10 by Z_CLU

చాన్నాళ్ల తర్వాత మెగాఫోన్ పట్టిన హరీష్ శంకర్, ప్రస్తుతం వాల్మీకి అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 6న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది వాల్మీకి.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమాను వాల్మీకి పేరిట రీమేక్ చేస్తున్నారు. తమిళ వెర్షన్ తో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేశాడు దర్శకుడు. మూవీని మరింత ఎంటర్ టైనింగ్ గా మార్చాడు. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం పూజా హెగ్డేను తీసుకున్నాడు. వరుణ్-పూజా కాంబోలో ఇది రెండో సినిమా.

ఒరిజినల్ వెర్షన్ లో బాబి సిమ్హా పోషించిన పాత్రను వరుణ్ తేజ్ పోషిస్తున్నాడు. పక్కా మాస్ క్యారెక్టర్ ఇది. ఇక సిద్దార్థ్ పోషించిన పాత్రలో అధర్వ నటిస్తున్నాడు. ఇది పక్కా క్లాస్ పాత్ర. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.