రేపే తొలిప్రేమ టీజర్ లాంచ్

Tuesday,December 19,2017 - 12:09 by Z_CLU

ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా తొలిప్రేమ. వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు రేపట్నుంచి అఫీషియల్ గా ప్రమోషన్ ప్రారంభించబోతున్నారు. రేపు (20-12-2017) ఉదయం సరిగ్గా 10 గంటలకు తొలిప్రేమ టీజర్ ను లాంచ్ చేయబోతున్నారు.

శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర (ఎస్వీసీసీ) బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు ఈ సినిమాను. కథ ప్రకారం మేజర్ పార్ట్ షూటింగ్ ను లండన్ లో చేశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావడంతో అదే ఊపులో టీజర్ ను కూడా విడుదల చేయబోతున్నారు.

తొలిప్రేమ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎ జర్నీ ఆఫ్ లవ్ అనేది దీనికి ట్యాగ్ లైన్. ఫిబ్రవరి 9న తొలిప్రేమ సినిమాను థియేటర్లలోకి రానుంది.