తొలిప్రేమ టీజర్ రివ్యూ

Wednesday,December 20,2017 - 11:35 by Z_CLU

వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలిప్రేమ టీజర్ రిలీజైంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ తోనే సినిమా కాన్సెప్ట్ ను ఎలివేట్ చేసింది. స్టయిలిష్ గెటప్ లో వరుణ్ తేజ్ లుక్స్ టీజర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

“మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చి వెళ్లినా, మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మరిచిపోలేం” అంటూ వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్ టీజర్ కు న్యూ లుక్ ఇవ్వడంతో పాటు సినిమా థీమ్ ను ఎలివేట్ చేసింది. లండన్ అందాలు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్స్ గా నిలిచాయి.

ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది తొలిప్రేమ. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్.