ఇంప్రెస్ చేస్తున్న ‘తొలిప్రేమ’ ట్రైలర్

Friday,February 02,2018 - 12:33 by Z_CLU

వరుణ్ తేజ్ తొలిప్రేమ రిలీజయింది. నిన్న రిలీజ్ కావాల్సిన ట్రైలర్ అనుకున్న రోజు కాకుండా కాస్త లేట్ గా రిలీజైనందుకు ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయినా, ఈ రోజు రిలీజైన ఈ ట్రైలర్ యూత్ ని ఇంప్రెస్ చేస్తుంది.

‘జ్ఞాపకాలు.. చెడ్డవైనా మంచివైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి’ అంటూ బిగిన్ అయ్యే ట్రైలర్, మళ్ళీ అదే డైలాగ్ తో క్లోజ్ అవ్వడంతో కంప్లీట్ లవ్ ఫీల్ జెనెరేట్ చేస్తుందీ ట్రైలర్. హీరోయిన్ ని ట్రైన్ లో చూసీ చూడంగానే లవ్ లో పడిన హీరో, మళ్ళీ ఆ అమ్మాయిని కాలేజ్ లో కలుసుకోవడం, ఆ తరవాత ఇద్దరి మధ్య క్రియేట్ అయ్యే కాంఫ్లిక్ట్… టీనేజ్ నుండి మెచ్యూర్డ్ స్టేజ్ కి ట్రాన్స్ ఫామ్ అయ్యే లవ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ మూవీ, సూపర్ హిట్ అయ్యే చాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయనిపిస్తుంది.

వరుణ్ తేజ్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి B.V.S.N. ప్రసాద్ నిర్మాత. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 10 న గ్రాండ్ గా రిలీజవుతుంది. S.S. తమన్ మ్యూజిక్ కంపోజర్.