VJ13 వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం

Monday,September 19,2022 - 01:23 by Z_CLU

‘గని’ తర్వాత కొన్ని నెలలు బ్రేక్ తీసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమాను ప్రారంభించాడు. సోనీ పిక్చర్స్ బేనర్ లో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ బైలింగ్వెల్ గా వరుణ్ తేజ్ చేయబోతున్న సినిమా ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఇండియన్ ఎయిర్ పోర్స్ లో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు వరుణ్. తాజాగా రిలీజ్ చేసిన సినిమా లాంచ్ పోస్టర్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి పెంచుతుంది.

ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా నవంబర్ నుండి షూటింగ్ జరుపుకోనుంది. వచ్చే ఏడాదిలో తెలుగు , హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఓ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి యూకేలో మొదలు కానుంది. టోటల్ షూట్ అంతా అక్కడే ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమాతో పాటే వరుణ్ ఈ సినిమా షూట్ లో పాల్గొననున్నాడు.

*Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics