బ్రేక్ తీసుకున్న వరుణ్ తేజ్

Tuesday,June 12,2018 - 04:16 by Z_CLU

సంకల్ప్  రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది వరుణ్ తేజ్ కొత్త సినిమా. స్పేస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 35 రోజుల భారీ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పేసింది. ఈ షెడ్యూల్ లో స్పేస్ కి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించింది సినిమా యూనిట్.

ఆంటీ గ్రావిటీ కండిషన్ లో ఉండబోయే ఈ సీన్స్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడు వరుణ్ తేజ్. సినిమాలో హై ఇంపాక్ట్ క్రియేట్ చేయనున్న ఈ సీన్స్ ని తెరకెక్కించడం కోసం ప్రత్యేకంగా లేటెస్ట్ టెక్నాలజీని వాడారు ఫిల్మ్ మేకర్స్.

క్రిష్, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. త్వ్రాలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.