నా పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉంది

Sunday,May 24,2020 - 02:16 by Z_CLU

తన పెళ్లిపై వచ్చిన పుకార్లను ఖండించాడు వరుణ్ తేజ్. తన పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉందంటున్నాడు.

రీసెంట్ గా నాగబాబు ఓ మీడియా హౌజ్ తో మాట్లాడుతూ.. త్వరలోనే నిహారికకు పెళ్లి చేసేస్తామని, ఆ వెంటనే వరుణ్ తేజ్ కు పెళ్లి చేస్తామని ప్రకటించాడు. దీన్ని రకరకాలుగా రాశాయి కొన్ని వెబ్ సైట్స్. వీటిపై క్లారిటీ ఇస్తూ.. తన పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉందని ప్రకటించాడు వరుణ్.

అసలు ఈ సీన్ అంతా సాయితేజ్ తో మొదలైంది. ఏదో వెబ్ సైట్ లో వచ్చిన క్లిప్పింగ్ ను సాయితేజ్ ట్యాగ్ చేసి, నీకు పెళ్లంటగా వరుణ్ అంటూ టీజ్ చేశాడు. దానికి రియాక్ట్ అవుతూ క్లారిటీ ఇచ్చాడు వరుణ్ తేజ్.

వరుణ్ తేజ్, సాయితేజ్, రానా, నితిన్ ది ఇండస్ట్రీలో ఓ బ్యాచ్. ఇప్పుడీ బ్యాచ్ లోంచి నితిన్, రానాకు పెళ్లిళ్లు అయిపోతున్నాయి. దీంతో సహజంగానే సాయితేజ్, వరుణ్ తేజ్ పై అందరి ఫోకస్ పడింది.

ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తున్నా సాయితేజ్.. ఆ మూవీకి ప్రచారం ఇస్తూనే మరోవైపు సింగిల్స్ సో బెటర్ అనే స్లోగన్ అందుకున్నాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు.