అప్పుడే మరో సినిమాకు రెడీ..

Tuesday,August 02,2016 - 05:44 by Z_CLU

 

ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ అనే సినిమా చేస్తున్నాడు మెగా హీరో వరుణ్ తేజ. ఈ సినిమా మేజర్ షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. ఇదిలా ఉండగా… ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత… శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు వరుణ్ తేజ అంగీకరించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే శ్రీనువైట్ల సినిమా కంప్లీట్ అయిన తర్వాతే కమ్ముల సినిమా సెట్స్ పైకి వస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం… కమ్ముల సినిమా ఈనెల 5నే ప్రారంభం అవుతుంది. అంతేకాదు… కమ్ముల-వరుణ్ తేజ సినిమా టైటిల్ ను కూడా అదే రోజు ప్రకటించే అవకాశం ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ప్రేమమ్ ఫేం పల్లవి.. ఈ సినిమాలో వరుణ్ తేజ సరసన హీరోయిన్ గా నటించనుంది. అర్బన్ లవ్ బేస్డ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. మూవీకి సంబంధించి ఇప్పటికే హీరోహీరోయిన్లతో కమ్ముల ఓ వర్క్ షాప్ కూడా నిర్వహించాడు. కాబట్టి… త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలున్నాయి.