నెక్స్ట్ ఇయర్ అలా ప్లాన్ చేసాడు ...

Tuesday,December 27,2016 - 02:30 by Z_CLU

మెగాహీరో వరుణ్ తేజ్ వచ్చే ఏడాది 3 సినిమాలతో ఎంటర్టైన్ చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఇప్పటికే శ్రీను వైట్ల డైరెక్షన్ లో ‘మిస్టర్’ అనే సినిమాతో పాటు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ‘ఫిదా’ అనే సినిమా చేస్తున్న ఈ మెగాహీరో… ఇదే ఊపులో మరో సినిమాను కూడా సెట్స్ కి తీసుకురావాలని చూస్తున్నాడు.

ప్రెజెంట్ రెండు సినిమాల షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్న ఈ మెగా హీరో త్వరలో వెంకీ అట్లూరి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఫీల్ మై లవ్’ ను టైటిల్ గా ఫిక్స్ చేశారని టాక్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది స్టార్టింగ్ లో సెట్స్ పై పెట్టి ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అన్నీ కుదిరితే ఈ మెగా హీరో నుంచి నెక్స్ట్ ఇయర్ 3 సినిమాలతో సందడి చేయబోతున్నాడన్నమాట.