ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి జార్జియాలో వరుణ్ తేజ్ కొత్త సినిమా

Friday,February 23,2018 - 12:08 by Z_CLU

ఫిదా, తొలిప్రేమ రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న వరుణ్ తేజ్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో ఓ ప్రయోగాత్మక చిత్రం చేయబోతున్నాడు వరుణ్. ఇదొక స్పేస్ మూవీ. అంటే అంతరిక్షంలో నడిచే కథ. ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. అది కూడా ఇండియాలో కాదు. జార్జియా దేశంలో.

ఈ మూవీకి సంబంధించి ప్రత్యేకంగా ట్రయినింగ్ తీసుకోబోతున్నాడు వరుణ్ తేజ్. జీరో గ్రావిటీ కండిషన్స్ లో ఎలా ఉంటారో తెలుసుకోవడం కోసం కొన్ని రోజుల పాటు బ్యాంకాక్ లేదా అమెరికాలో శిక్షణ తీసుకోబోతున్నాడు. ఆ తర్వాత జార్జియా వెళ్లి ఫస్ట్ షెడ్యూల్ లో పాల్గొంటాడు.

గతంలో అండర్ వాటర్ కాన్సెప్ట్ తో ఘాజీ సినిమా తీసిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి, ఈసారి అంతరిక్షాన్ని నేపథ్యంగా తీసుకున్నాడు. 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, రాజీవ్ రెడ్డి ఈ సినిమను నిర్మించబోతున్నారు. కేవలం స్పేస్ స్టోరీ మాత్రమే కాకుండా, ఇందులో ప్యారలల్ గా లవ్ స్టోరీ కూడా ఉంది. త్వరలోనే ఈ మూవీలో నటించే హీరోయిన్ పేరును ఎనౌన్స్ చేస్తారు.