వరుణ్ తేజ్ కొత్త సినిమా లాంచ్ అయింది

Monday,March 19,2018 - 12:12 by Z_CLU

ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు వరుణ్ తేజ్. ఆంటీ గ్రావిటీ పరిస్థితుల్లో అస్ట్రోనాట్స్ ఎలా మ్యానేజ్ చేస్తారు..? లాంటి విషయాలపై అవగాహన తెచ్చుకుంటున్న ఈ హీరో  మరో సినిమా నిన్న ఉగాది సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఫిల్మ్ మేకర్స్.

రీసెంట్ గా సాగర్ చంద్ర చెప్పిన స్టోరీలైన్ కి ఇంప్రెస్ అయిపోయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ బిగిన్ చేసిన సినిమా యూనిట్, ఉగాది సదర్భంగా ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

14 రీల్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ సినిమాల కన్నా భిన్నంగా ఉండబోతుందని చెప్తున్నారు ఫిల్మ్ మేకర్స్. దానికి తోడు ‘అప్పట్లో ఒకడుండేవాడు ‘ సినిమాతో ఇంప్రెస్ చేసిన దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్ లో సినిమా అనగానే న్యాచురల్ గానే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ తో పాటు తక్కిన టెక్నీషియన్స్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ సినిమాకి రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు.