వరుణ్ తేజ్ కొత్త సినిమా లాంచ్

Saturday,June 17,2017 - 11:10 by Z_CLU

వరుణ్ తేజ్ కొత్త సినిమా లాంచ్ అయింది. సినిమా సినిమా డిఫెరెన్స్ మెయిన్ టైన్ చేస్తూ, కరియర్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్న వరుణ్ తేజ్, మరో డిఫెరెంట్ ఎంటర్ టైనర్ కి రెడీ అయిపోయాడు. ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా ఫిక్సయింది.

 

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కనుంది. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సినిమా యూనిట్ కరెక్ట్ టైం చూసుకుని రెగ్యులర్  షూటింగ్ బిగిన్ చేసే ఆలోచనలో ఉంది.