మిస్టర్ ట్రేలర్ రిలీజయింది

Wednesday,March 22,2017 - 06:25 by Z_CLU

అవుట్ స్టాండింగ్ లవ్ & యాక్షన్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతున్న ‘మిస్టర్’ ట్రేలర్ రిలీజయింది. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠి లు హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడే డీసెంట్ హిట్ గ్యారంటీ లాంటి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు రిలీజైన ఈ ట్రేలర్ 100 % ఇంప్రెసివ్ అనిపించుకుంటుంది.

ట్రేలర్ లో ఎగ్జాక్ట్ స్టోరీ ఎక్కడ బిగిన్ అవుతుందో తెలీడం లేదు కానీ డెఫ్ఫినేట్ గా స్టోరీలో ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మేజర్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలిసిపోతుంది. దానికి తోడు అక్కడక్కడ పంచ్ డైలాగ్స్ తో కామెడీ సీక్వెన్సెస్, మరీ టూ మచ్ అనిపించకుండానే ఓ రెండు హార్ట్ టచింగ్ డైలాగ్స్, అయ్యో మరీ సాఫ్ట్ కాన్సెప్టా అనిపించకుండా భారీ డైలాగ్ తో విలన్ ఇంట్రడక్షన్, మొత్తానికి వరుణ్ తేజ్ ‘మిస్టర్’ ట్రేలర్ డీసెంట్ గా కట్ చేసిన ఫుల్ మీల్స్ లాంటి ట్రేలర్ అనిపించుకుంటుంది.

ఏప్రియల్ 14 న రిలీజ్ కి రెడీ అవుతున్న ‘మిస్టర్’ మొన్నటికి మొన్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి మ్యాగ్జిమం మ్యూజిక్ లవర్స్ ని ఎట్రాక్ట్ చేసింది. ఇప్పుడీ ట్రేలర్ అంతే డీసెంట్ గా ఫాస్ట్ పేజ్ లో రీచ్ అవుతుంది. సినిమా సినిమాకి డిఫెరెన్స్ మెయిన్ టైన్ చేసే వరుణ్ తేజ్ కరియర్ లో ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రిజిస్టర్ అయినట్టే అనిపిస్తుంది.