మిస్టర్ ఫస్ట్ సింగిల్ రిలీజయింది

Monday,March 20,2017 - 05:36 by Z_CLU

వరుణ్ తేజ్ మిస్టర్ ఫస్ట్ సింగిల్ రిలీజయింది. అల్టిమేట్ క్లాస్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కింది. సినిమా యూనిట్ ముందుగానే అనౌన్స్ చేసినట్టు రిలీజైన ఈ ఫస్ట్ సింగిల్ మెలోడియస్ మ్యాజిక్ ని స్ప్రెడ్ చేస్తుంది.

‘ఏదో ఏదో బావుందే’ అంటూ సాగే ఈ పాట 3:40 నిమిషాలు బావుందనే అనిపిస్తుంది. యూట్యూబ్ లో ఈ పాటతో పాటు రిలీజైన స్టిల్స్ ని బట్టి డెఫ్ఫినేట్ గా ఈ సాంగ్ వరుణ్ తేజ్, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో తెరకెక్కిందని తెలుస్తుంది.

 

మిక్కీ జె మేయర్ ‘మిస్టర్’ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఇక పర్టికులర్ గా ‘ఏదో ఏదో బావుందే’ సాంగ్ విషయానికి వస్తే రాహుల్ నంబియార్ పాడిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.