వరుణ్ తేజ కొత్త సినిమా పేరు ఇదే..

Friday,August 05,2016 - 11:25 by Z_CLU

ఫిదా… శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ చేయబోతున్న కొత్త సినిమాకు ఇదే పేరు పెట్టారు. దీనికి సంబంధించిన ఓ టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఫిదా అనే క్యాచీ టైటిల్ పెట్టి… ప్రాజెక్టుకు క్రేజ్ తీసుకొచ్చిన శేఖర్ కమ్ముల… ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను తనదైన స్టయిల్ లో కామ్ గా స్టార్ట్ చేశాడు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఫిదా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచి మొదలైంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఓ ఎన్నారై అబ్బాయ్, తెలంగాణ అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమకథగా ఫిదా సినిమా తెరకెక్కుతోంది. రెగ్యులర్ గా తన సినిమాలకు సంగీతం అందించే మిక్కీ జే మేయర్ ను ఈసారి కమ్ముల సెలక్ట్ చేయలేదు. ఫిదా సినిమాకు శక్తికాంత్ అనే సంగీత దర్శకుడ్ని ఎంపిక చేసుకున్నారు.