వాల్మీకిలా మారిన వరుణ్ తేజ్

Thursday,April 18,2019 - 12:56 by Z_CLU

పూర్తిగా మేకోవర్ అయ్యాడు. వాల్మీకి సెట్స్ పైకి వచ్చాడు. అవును.. వరుణ్ తేజ్ ఇవాళ్టి నుంచి వాల్మీకి సెట్స్ పైకి వచ్చాడు. ఈ సినిమాలో అతడు నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. అదే వాల్మీకి స్పెషాలిటీ. 35 రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షెడ్యూల్ నడుస్తుంది.

వాల్మీకి సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన సెకెండ్ షెడ్యూల్ లో వరుణ్ తేజ్ జాయిన్ అయ్యాడు. ఈ మూవీ కోసం కాస్త భయంకరంగా కనిపించేందుకు గడ్డాలు, మీసాలు గుబురుగా పెంచాడు వరుణ్.

తమిళ్ సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమాకు రీమేక్ గా వస్తోంది వాల్మీకి సినిమా. దర్శకుడు హరీష్ శంకర్ మన నేటివిటీకి తగ్గట్టు ఈ సినిమాలో చాలా మార్పులు చేశాడు. గతంలో ఈ దర్శకుడు తీసిన గబ్బర్ సింగ్ రీమేక్ ప్రాజెక్టు ఎంత హిట్ అయిందో తెలిసిందే. అందుకే వాల్మీకిపై అంచనాలు పెరిగాయి.