వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ

Wednesday,September 18,2019 - 02:41 by Z_CLU

‘వాల్మీకి’ తో గద్దలకొండ గణేష్ గా రాబోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించాడు. ‘వాల్మీకి’ తో పాటు వరుణ్ చెప్పిన మరిన్ని విశేషాలు తన మాటల్లోనే …

లవ్ స్టోరీ చెప్పారు… కానీ

‘ఫిదా’, ‘తొలి ప్రేమ’ తర్వాత లవ్ స్టోరీస్ కి కొంచెం బ్రేక్ తీసుకుందామని అనుకున్నా. కానీ అందరూ లవ్ స్టోరీస్ తోనే అప్రోచ్ అయ్యారు. అలాగే హరీష్ శంకర్ గారు ముందు ఓ లవ్ స్టోరీ చెప్పారు. అది అద్బుతంగా ఉంది. కానీ మీ సినిమాలు డిఫెరెంట్ గా ఉంటాయి ఇలాంటి సినిమా ఎందుకు అని అడిగాను. మీ టైప్ సినిమా చేయాలనుంది అని ఆయనతో చెప్పాక దాదాపు ఓ ఎనిమిది గంటలు ఇద్దరి మధ్య డిస్కర్షన్ జరిగి అప్పుడు ‘జిగర్తాండ’ రీమేక్ చేద్దాం అని ఆయన చెప్పారు. ఆ తర్వాత నన్ను సినిమా చూడమని అన్నారు. చూసిన నెక్స్ట్ డే ‘వాల్మీకి’ చేద్దామని డిసైడ్ అయ్యాం.

యాబై శాతం మార్పుతో

‘జిగార్తండ’ వండర్ ఫుల్ ఫిలిం. నాకు బాగా నచ్చిన తమిళ్ సినిమాల్లో అదీ ఒకటి. అందులో కొన్ని సన్నివేశాలను రిప్లికేట్ చేసాం. కాకపోతే యాబై శాతం మార్పులు చేసాం. క్యారెక్టరైజేషణ్ ని ఇంకా పెంచడం జరిగింది. కథ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. చూసిన వారికి కూడా నచ్చేలా ట్రై చేశాం. గణేష్ ఎందుకు ఇలా మారాల్సి వచ్చింది.. అనేది యాడ్ చేశాం అంతే. నా క్యారెక్టర్ తో కనెక్ట్ అవ్వడానికే చేసాను.

పెదనాన్నకే చెప్పాను

ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాక కొంతమంది చూసుకో ఇప్పుడు ఈ టైప్ విలన్ క్యారెక్టర్ చేయడం అవసరమా అన్నారు. అందుకే డైరెక్ట్ గా పెదనాన్న దగ్గరికి స్క్రిప్ట్ తీసుకెళ్ళాను. హరీష్ శంకర్ గారు పెదనాన్నకి పూర్తి స్క్రిప్ట్ చెప్పారు. ఆయనకీ బాగా నచ్చింది. కథ చాలా బాగుంది. నీ క్యారెక్టరైజేషణ్ కూడా బాగుంది. నువ్వు చేయాలి అన్నారు. ఆ తర్వాత ఆయన హరీష్ గారికి కొన్ని సజిషన్స్ ఇచ్చారు. ఆయన అప్లై చేసారు కూడా. సో ముందు పెదనాన్న ఫ్యీడ్ బ్యాక్ తీసుకున్నాకే మొదలెట్టాను.

 

అందుకే చేశాం..సక్సెస్ అయితే హ్యాపీ

కొన్ని సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటుంది. కానీ ఆ సినిమాలు ఆడియన్స్ అందరికీ రీచ్ అవ్వదు. జిగర్తాండ అలాంటి సినిమానే అందుకే రీమేక్ చేశాం. ఒక మంచి సినిమాను మళ్ళీ రీచ్ చేయడానికి రీమేక్ చేయడం తప్పు లేదని నా ఫీలింగ్.

ఎక్స్ పీరియన్స్ బాగుంది

ఇప్పటి వరకూ నేను ఇంత మాస్ క్యారెక్టర్ ప్లే చేయలేదు. లోఫర్ లో కొంత వరకూ మాస్ చేసినా ఈ రేంజ్ లో ఉండదు. గద్దలకొండ గణేష్ క్యారెక్టరైజేషణ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎక్స్ పీరియన్స్ బాగుంది. ఈ సినిమా వరకూ నేను ఎలా ఉన్నానో కూడా పట్టించుకోలేదు. మేకప్ లాంటివి మ్యాగ్జిమం అవైడ్ చేసాను. జస్ట్ జుట్టుని అలా పక్కకి అనుకొని షాట్ లో అడుగుపెట్టేవాణ్ణి.

 

బౌండరీస్ లేని క్యారెక్టర్

జనరల్ గా ఏదైనా క్యారెక్టర్ చేసే టప్పుడు కొన్ని బౌండరీస్ ఉంటాయి. కానీ గద్దలకొండ గణేష్ క్యారెక్టర్ కి అలాంటివేం లేవు. అందుకే లిమిటేషన్స్ లేకుండా నటించగలిగాను. హరీష్ శంకర్ గారు క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడే బాగా అర్థం చేసుకున్నాను. అందుకే పెద్దగా కష్టం అనిపించలేదు.

ఆ సీనుకి హాల్ఫ్ డే తీసుకున్నా

సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ హైలైట్ గా ఉంటుంది. ఆ సీన్ కె దాదాపు హాఫ్ డే డబ్బింగ్ చెప్పాను. వేరియేషన్స్ తో చేసిన సన్నివేశం అది. అందుకే డబ్బింగ్ లో మరీ శ్రద్ధ తీసుకున్నాను.

ఆ విషయంలో నేను లక్కీ

ఏ నటుడికైనా విభిన్న పాత్రలు చేయాలని ఉంటుంది. నాకు కూడా ఉంది. కానీ లక్కీగా నాకు అలాంటి పాత్రలే వస్తున్నాయి. అందుకే నేను లక్కీ అనుకుంటాను. మనం ఎక్స్ పెక్ట్ చేసినా అలాంటి పాత్రలు మన దగ్గరికి రావాలి కదా.

పీరియాడిక్ సినిమా చేయాలనుంది

ఎప్పటికైనా రెట్రో లుక్ తో ఓ పీరియాడిక్ సినిమా చేయాలనుంది. ఇంత వరకూ అలాంటి కథలు నా దగ్గరికి రాలేదు. వస్తే కచ్చితంగా చేస్తాను.

రెస్పాన్స్ అదిరింది

సినిమాలో ఎల్లువొచ్చి సాంగ్ ను రీమిక్స్ చేసాం. ఆ సాంగ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని భయం వేసింది. కానీ మొన్న ప్రీ రిలీజ్ లో అప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆ సాంగ్ రాగానే గట్టిగా అరిచారు. ఆ రెస్పాన్స్ చూసి షాక్ అయ్యాను.

 

రెండేళ్లుగా

14 రీల్స్ ప్లస్ లో రెండుళ్ళుగా సినిమా చర్చలు జరుగుతున్నాయి. ఏది వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ గా ‘వాల్మీకి’తో కుదిరింది. నా సినిమాతో బ్యానర్ లాంచ్ అవ్వడం హ్యాపీ గా ఉంది.

పూజా హెగ్డే తో మళ్ళీ యానం

నాలుగేళ్ల తర్వాత పూజాతో సినిమా చేసాను. ముకుందా షూటింగ్ యానంలో జరిగింది. వాల్మీకి సాంగ్ కూడా యానంలో తీసారు. అదే హోటల్ లో మళ్ళీ దిగాం. ముకుందా డేస్ గుర్తుచేసుకున్నాం. పూజా బ్యూటిఫుల్ గర్ల్ చిన్న క్యారెక్టర్ అయినా బెస్ట్ ఇచ్చింది. దేవి క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అవుతుంది.

 

అధర్వ అమేజింగ్

అధర్వ తన క్యారెక్టర్ కి బెస్ట్ అనిపిస్తాడు. తనకి తెలుగులో ఇది మొదటి సినిమా. చాలా బాగా చేసాడు. జస్ట్ అమేజింగ్. ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉండటం వల్ల ప్రమోషన్స్ కి రాలేకపోతున్నాడు.

చిరంజీవి బయోపిక్ నేనే

చిరంజీవి గారి బయోపిక్ చరణ్ అన్న చేస్తేనే బాగుంటుంది. ఒక వేళ అన్నయ్య చేయకపోతే ఆ లైన్ లో నెక్స్ట్ నేనే ఉంటాను. హరీష్ శంకర్ గారు నాతో చిరంజీవి గారి బయోపిక్ చేయాలనుందని అన్నారు. సో చూడాలి ఏం జరుగుతుందో.

మార్కెట్ పెరిగితేనే

ప్రతీ సినిమాతో మార్కెట్ పెంచుకోవాలని ఉంటుంది. అప్పుడే ఏదైనా ప్రయోగాలకు బడ్జెట్ దొరుకుతుంది. లేదంటే మార్కెట్ ని బట్టి బడ్జెట్ తగ్గుతుంది. కొన్ని సినిమాలకు భారీ బడ్జెట్ కావాల్సి వస్తుంది. అందుకే మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నాను.

 

షూటింగ్ లోనే తెలిసిపోయింది

‘అంతరిక్షం’ స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. కానీ షూటింగ్ టైంలో మాకు అవుట్ పుట్ ఏంటనేది తెలిసిపోయింది. ఆ సినిమా రిజల్ట్ చూసి కొంత డిసప్పాయింట్ అయ్యాను. నా ఆఫీస్ ముందు ఆ సినిమా హోర్డింగ్ పెట్టుకున్నాను. ఎప్పుడైనా అలాంటి ప్రయోగాత్మక సినిమాలు వచ్చినప్పుడు అది చూసి చేసిన తప్పును తలుచుకుంటాను. అలాంటివి జరగకుండా చూసుకుంటాను.

ఇంకా సెట్ అవ్వలేదు

సాగర్ చంద్రతో సినిమా డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. నిన్న కూడా కలిసాం. ఇంకా స్క్రిప్ట్ సెట్ అవ్వలేదు. అవ్వగానే ఆ సినిమా స్టార్ట్ అవుతుంది.