వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ

Saturday,February 10,2018 - 02:03 by Z_CLU

వరుణ్ తేజ్ తొలిప్రేమ ఈ రోజే గ్రాండ్ గా రిలీజయింది. అల్టిమేట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి, తన నెక్స్ట్ సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. అవి మీ కోసం…

 

ఇది ఈ జెనెరేషన్ తొలిప్రేమ

పవన్ కళ్యాణ్ గారి తొలిప్రేమ లో సెల్ ఫోన్ లేదు. తన లవ్ ని ఎక్స్ ప్రెస్ చేయడానికే టైమ్ పడుతుంది. దానికి ఆ జెనెరేషన్ అంతలా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ జెనెరేషన్ కి ఆ సినిమాని  థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసే చాన్స్ లేదు. ఈ తొలిప్రేమ కంప్లీట్ గా డిఫెరెంట్ గా ఉంటుంది. చూడగానే ప్రపోజ్ చేసేస్తాడు. టెక్నాలజీ ఉంటుంది. ఇది కంప్లీట్ గా ఈ జెనెరేషన్ తొలిప్రేమ.

చాలా టైటిల్స్ అనుకున్నాం…

సినిమాకి బిగినింగ్ నుండి చాలా టైటిల్స్ అనుకున్నాం. కథను బట్టి ఇంగ్లీష్ టైటిల్స్ తడుతున్నాయి. కానీ తెలుగులో ఉంటే బెటరనుకున్నాం. చివరికి బాపి గారు వెంకీ ఈ టైటిల్ బెస్ట్ అనుకున్నారు. కంపల్సరీగా కంపారిజన్స్ ఉంటాయి అని తెలుసు… కానీ అన్నింటిని మించి స్టోరీకి ఆప్ట్ అనిపించే ఈ డెసిషన్ తీసుకున్నాం.

బాబాయ్ తో అసలు మాట్లాడలేదు…

అసలు ఈ టైటిల్ గురించి బాబాయ్ తో అసలు డిస్కస్ చేయలేదు. జనరల్ గా టాపిక్ కూడా ఎప్పుడూ రాలేదు. టైటిల్ ఉషా కిరణ్ మూవీస్ దగ్గర ఉందని తెలిసినప్పుడు వాళ్ళను కాంటాక్ట్ చేశాం. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నారు.

డిఫెరెంట్ గా ఉంటుంది…

‘ఫిదా’ సినిమాతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో క్యారెక్టర్ చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. మోర్ లవబుల్ అండ్ స్పీడ్ ఉంటుంది.

చూసినప్పుడు.. చేసినప్పుడు….

లండన్ లో షాట్ చేసిన ఎపిసోడ్స్ థియేటర్ లో చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఇక కాలేజ్ సీన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.

ఫస్ట్ లవ్ మ్యాటర్స్….

ఫస్ట్ లవ్ ని మర్చిపోవడం అంత ఈజీ కాదు. అది లైఫ్ లాంగ్ హాంట్ చేస్తూనే ఉంటుంది. ఆ ఫీలింగ్స్ ఈ సినిమాలో 3 టైమ్ ఫ్రేమ్స్ లో ఎలివేట్ అవుతాయి.

నాకెప్పుడూ జరగలేదు…

నేనెప్పుడూ లవ్ కోసం అంత టైమ్ స్పెండ్ చేయలేదు. కాబట్టి నాకా ఎక్స్ పీరియన్స్ లేదు. కానీ నా ఫ్రెండ్స్ విషయంలో జరిగింది కాబట్టి తొలిప్రేమ ఎఫెక్ట్ ఎంతలా ఉంటుందనేది నాకు తెలుసు…

డిఫెరెంట్ షేడ్స్…

ఈ సినిమాలో ఫస్ట్ 2 టైమ్ పీరియడ్స్ లో నేను అకాడమిక్స్ లో టాపర్. సో ఆబివీయస్ గా టాపర్ కి ఉండే అగ్రెసివ్ నెస్, దాని వల్ల చేసే తప్పులు, వాటి రిఫ్లెక్షన్స్… ఆ తరవాత వచ్చే మెచ్యూరిటీ… ఇలా డిఫెరెంట్ షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్ లో…

 

అందుకే చేస్తున్నా…

సినిమాలు చేయకముందు నుండే నాన్నా, బాబాయ్, పెదనాన్నతో పాటు హాలీవుడ్ సినిమాలు చూసే అలవాటుంది. ఆ సినిమాలు చూసినప్పుడు మన తెలుగు సినిమాలు ఇలా ఎందుకు ఉండటం లేదు..? మనం ఎందుకు చేయడం లేదు అనే ఆలోచన వచ్చేది. ఎప్పుడైతే నేను సినిమాలు చేయడం బిగిన్ చేశానో… నేనే ఎందుకు ఇనీషియేట్ తీసుకోకూడదు అనిపించింది. అందుకే నా సినిమాలో ఏదో డిఫెరెంట్ గా ఉండేటట్టు చూసుకుంటున్నా…

స్టార్ డమ్ ఊరికే రాదు…

ఒక క్యారెక్టర్ ని కంప్లీట్ గా పర్ఫామ్ చేసినప్పుడే స్టార్ డమ్ వస్తుంది. నేను స్టార్ అనిపించుకోవడం కన్నా, మంచి  పర్ఫామర్ అనిపించుకోవాలి. అందరూ సింప్లిస్టిక్ గా ఉండే సినిమాలే ఎక్కువగా ఇష్టపడుతున్నారనిపించింది. అందుకే ఎక్కువగా అలాంటివే ప్రిఫర్ చేస్తున్నా…

ఎవరైనా రిలేట్ అవుతారు…

మామూలుగా బ్రేకప్స్ అనేవి ఇమ్మెచ్యూరిటీ, ఈగోల వల్ల జరుగుతూంటాయి. ఈ సినిమాలో కూడా అదే జరుగుతుంది. చాలా మంది ఈ సీన్స్ కి రిలేట్ అవుతారు. U.S. ప్రీమియర్స్ తరవాత చాలా మంది ట్వీట్స్  చేస్తున్నారు. ఆ సీన్స్ కి రిలేట్ అయ్యాము అని…

అపోజిట్ క్యారెక్టర్స్….

సినిమాలో హీరో ఏది చేసిన తొందరగా చేస్తాను కానీ తప్పు చేయను అనుకుంటుంటాడు… హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి ఏం చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేసే రకం.. డిఫెరెంట్ ఆటిట్యూడ్స్…

 

అందుకే ఒప్పుకున్నాను…

వెంకీ కి ఇది ఫస్ట్ సినిమానే అయినా, రైటర్ గా ఎక్స్ పీరియన్స్ ఉంది. అంతకన్నా ఎక్కువగా దిల్ రాజు గారితో ట్రావెల్ చేశారు కాబట్టి, ఆయన కూడా వెంకీ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక వెంకీ తో సెట్స్ పైకి వచ్చాక తనలో ఎంత పొటెన్షల్ ఉందో అర్థమయింది.

నెక్స్ట్ సినిమా…

ఘాజి డైరెక్టర్ సంకల్ప్ తో సినిమా చేస్తున్నాను. సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఉండే సినిమా. స్పేస్ రిలేటెడ్ మూవీ. శ్రీహరి కోట బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ నడుస్తుంది. ఇలాంటి సినిమా తెలుగు ఆడియెన్స్ కి కొత్త కాబట్టి కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాని కంచె ప్రొడ్యూసర్స్, ఈశ్వర్, రాజీవ్ నిర్మిస్తున్నారు.

అనిల్ రావిపూడి తో సినిమా…

అనిల్ రావిపూడి నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఆయన ఇంకా నాకు కథ కూడా చెప్పలేదు. జస్ట్ లైన్ చెప్పాడంతే. అది డెవెలప్ అయ్యాక ఆ సినిమా గురించి ఆలోచిస్తాం.

అందుకే రాశిఖన్నా…

రాశిఖన్నా ‘ఊహలు గుసగుసలాగే’ సినిమాలో చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఆ తరవాత కూడా తను చాలా సినిమాల్లో నటించింది కానీ పర్ఫామెన్స్ కి పెద్దగా స్కోప్ లేదు. ఆ సినిమాలో రాశిని చూశాక ఈ క్యారెక్టర్ చేయడానికి తనే కరెక్ట్ అనుకున్నాం. రాశి కూడా చాలా రోజుల నుండి లవ్ స్టోరీ చేయాలనుకుంటుంది. అవకాశం రాగానే ఫుల్ జోష్ తో పర్ఫాం చేసింది.

 

అందుకే వర్కవుట్…

ఫిదా, మిస్టర్ సినిమాల టైమ్ లో ఆక్సిడెంట్ వల్ల దాదాపు 60 – 70 రోజులు ఇంట్లో ఉండిపోయా. దాంతో బరువు పెరిగిపోయా. ఫిదా లో గమనిస్తే నా పర్సనాలిటీలో అక్కడక్కడా వేరియేషన్స్ ఉంటాయి. ఇక ఈ సినిమా విషయానికి వచ్చేసరికి, కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సీక్వెన్సెస్ కోసం ఇంకా తగ్గాల్సి వచ్చింది…

బాధ అనిపిస్తుంది….

ఇష్టపడి ఏదైనా సినిమా చేసినప్పుడు అది వర్కవుట్ కాకపోతే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ‘కంచె’ లాంటి సినిమా చేసినప్పుడు కలెక్షన్స్ తక్కువగా ఉంటాయని తెలుసు. అలాంటి సినిమాలు తెలిసే చేస్తాం. అయినా  ఆలాంటి సినిమాలు కూడా ఆడి, సక్సెస్ అయితే మరికొంతమంది ప్రొడ్యూసర్స్ మంచి సినిమాలు చేయడానికి ముందుకు  వస్తారు.

సొంత బ్యానర్ లో…

నాన్నతో మాట్లాడాను మన బ్యానర్ లో చేద్దామని, అయన ఇప్పుడు మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారుగా చేసుకో, మంచి స్టోరీ, డైరెక్టర్ అన్నీ కలిసి వచ్చినప్పుడు చేద్దాం అన్నారు….

డ్యాన్స్ కోసం కష్టపడ్డాను…

సినిమాలో 2 పాటలకు చాలా రిహార్సల్స్ చేశాను. సతీష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ చాలా సపోర్ట్ చేశారు. చాలా ప్రాక్టీస్ చేసి మరీ చేశాను…