Varun Tej - నాగ్ దర్శకుడితో మెగా హీరో

Wednesday,May 19,2021 - 03:45 by Z_CLU

చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన మార్క్ మూవీస్ తో ఒక సెపరేట్ ఇమేజ్ అందుకున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. రాజశేఖర్ తో తీసిన ‘గరుడవేగ’ ప్రవీణ్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఒక సీనియర్ హీరోతో అలాంటి ఎక్స్పరిమెంట్ సినిమా తీయడం పెద్ద సాహసమే అని ప్రవీణ్ పై ప్రశంసల జల్లు కురిసింది.

Praveen Sattaru

ఇక తాజాగా తమన్నాతో ఓ వెబ్ సిరీస్ కూడా చేశాడు. ప్రస్తుతం నాగార్జునతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న ప్రవీణ్ సత్తారు నెక్స్ట్ వరుణ్ తేజ్ తో సినిమా చేయబోతున్నాడు. అవును.. రెండేళ్ళ క్రితమే వరుణ్ కి స్క్రిప్ట్ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. దానికి సంబంధించి పూర్తి కథ రెడీ గా ఉంది. సెట్స్ పైకి వెళ్ళడమే ఆలస్యం.

varun tej zeecinemalu

ప్రెజెంట్ నాగార్జున తో తెరకెక్కిస్తున్న సినిమాతో బిజీగా ఉన్న ప్రవీణ్ సత్తారు ఆ సినిమా ఓ కొలిక్కి రాగానే వరుణ్ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఈ లోపు వరుణ్ చేతిలో ఉన్న ‘గని’ సినిమాతో పాటు వెంకీ కుడుముల సినిమాను కూడా ఫినిష్ చేస్తాడు. ఇద్దరు ఫ్రీ అవ్వగానే ఈ కాంబోలో తెరెకెక్కే క్రేజీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్ మొదలు కానుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బేనర్ పై భోగవల్లి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాపై ప్రకటన రానుంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics