అవును.. నేను విలన్ గా నటిస్తున్నాను

Wednesday,December 19,2018 - 11:51 by Z_CLU

మొన్నటివరకు గాసిప్. ఇప్పుడది అఫీషియల్. తను విలన్ గా కనిపించబోతున్నాననే విషయాన్ని వరుణ్ తేజ్ కన్ ఫర్మ్ చేశాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఓ రీమేక్ సినిమాలో తను విలన్ క్యారెక్టర్ లో కనిపిస్తానని ప్రకటించాడు వరుణ్ తేజ్.

2014లో వచ్చింది జిగర్ తాండ సినిమా. సిద్దార్థ్ ఇందులో హీరోగా నటిస్తే, నెగెటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా బాబి సిమ్హా నటించాడు. ఇప్పుడీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రనే వరుణ్ తేజ్ పోషించబోతున్నాడు. ప్రస్తుతానికైతే వరుణ్ కు చిన్నపాటి నెరేషన్ మాత్రమే ఇచ్చాడు హరీష్ శంకర్. త్వరలోనే పూర్తి స్క్రీన్ ప్లేతో రాబోతున్నాడు.

అయితే వరుణ్ తేజ్ మాత్రం ఈ స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు కోరాడు. పూర్తిగా తమిళ్ ఫ్లేవర్ తో ఉన్న ఈ సినిమాను నేటివిటీకి తగ్గట్టు మార్చాలని సూచించాడు. రీమేక్స్ ను నేటివిటీకి, హీరో బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు ఎంత అద్భుతంగా మార్చగలడో గబ్బర్ సింగ్ సినిమాతో నిరూపించుకున్నాడు హరీష్ శంకర్. సో.. జిగర్ తాండను కూడా కచ్చితంగా మంచి స్క్రిప్ట్ గా మారుస్తాడనంలో ఎలాంటి సందేహం లేదు.