అనిల్ రావిపూడి మల్టీస్టారర్ లో వరుణ్ తేజ్

Tuesday,December 26,2017 - 06:35 by Z_CLU

అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీ సెట్స్ పైకి రాకముందే ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. ఫుల్లీ లోడెడ్ ఫన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాలో వెంకటేష్ నటిస్తున్నాడనే న్యూస్ టాలీవుడ్ లో వైబ్రేషన్ సృష్టిస్తూనే మరో హీరో ఎవరా అనే క్యూరాసిటీ ని కూడా రేజ్ చేసింది. అయితే ఇప్పుడా హీరో ప్లేస్ లో వరుణ్ తేజ్ పేరు కాస్త గట్టిగానే వినిపిస్తుంది.

ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒక పర్టికులర్ ఇమేజ్ కి ఫిక్స్ కాకుండా డిఫెరెంట్ గా సినిమాలు చేసుకుంటూ కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న వరుణ్ తేజ్ ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపించనున్నాడు. ఇంకా హీరోయిన్స్ తో పాటు తక్కిన టెక్నీషియన్స్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్.