నాని సరసన వరుణ్ తేజ్ హీరోయిన్

Saturday,April 22,2017 - 03:00 by Z_CLU

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్.  ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఇంకా విడుదలకాకముందే మరో తెలుగు సినిమా ఛాన్స్ దక్కించుకుంది సాయిపల్లవి. త్వరలోనే సెట్స్ పైకి రానున్న నాని సినిమా MCAలో సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపికైంది.

మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో సౌత్ లో పాపులర్ అయింది సాయి పల్లవి. ఆ సినిమాలో మేకప్ లేకుండా కనిపించిన సాయి పల్లవి టాలీవుడ్ ను కూడా ఆకర్షించింది. అలా శేఖర్ కమ్ముల ఫిదా సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఫిదాలో సాయిపల్లవి లుక్స్ నచ్చడంతో.. నానితో చేయనున్న  MCA అనే సినిమాలో కూడా సాయిపల్లవినే హీరోయిన్ గా తీసుకున్నారు దిల్ రాజు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రానుంది MCA మూవీ. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల నుంచి ఇది సెట్స్ పైకి వస్తుంది. ఈ సినిమాలో శ్రీకాంత్, భూమిక కీలక పాత్రలు పోషించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు.