వరుణ్ తేజ్ ఫోకస్ మారింది...

Thursday,September 19,2019 - 10:02 by Z_CLU

రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ గా మారుతుంది వరుణ్ తేజ్ ఫిల్మోగ్రఫీ. ఓ సినిమా సెట్స్ పైకి వచ్చిందంటే కనీసం ఆ సినిమా గురించి గెస్ చేయడానికి కూడా చాన్స్ లేకుండా కథల్ని ఎంచుకుంటాడు. వరసగా ఫిదా, తొలిప్రేమ లాంటి లవ్ ఎంటర్ టైనర్స్ చేశాడు. ఆ తరవాత హరీష్ శంకర్ తో సినిమా అనగానే ఈసారి యాక్షన్ కూడా ఉండబోతుందన్న మాట.. అనుకున్నారంతా.. కానీ ఎప్పుడైతే ఫస్ట్ లుక్ రిలీజైందో, ఫ్యాన్స్ మైండ్ లో రీల్ రివర్సైనంత పనయింది.

ఒక ఇమేజ్ పడకుండా చూసుకుంటున్నాడు అంతవరకు ఓకె… కానీ ఇంత గట్సీ గా క్యారెక్టర్స్ ని ఎంచుకోవడం వరుణ్ తేజ్ కే చెల్లింది. మోస్ట్ అగ్రెసివ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్న ఈ హీరో, ఫ్యూచర్ సినిమాల విషయంలో కూడా సేమ్ పాలసీ పాటించబోతున్నాడు.

‘వాల్మీకి’ తరవాత వరుణ్ తేజ్ కనిపించబోయేది బాక్సర్ గా. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ ఈ మెగా హీరో కోసం అద్భుతమైన కథ రెడీ చేసుకున్నాడని తెలుస్తుంది. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే ఈ సినిమా కోసం చాలా చేయబోతున్నాడు.

వాల్మీకి కోసం ఏకంగా 8 నెలలు గడ్డం పెంచిన వరుణ్ తేజ్, కొత్త సినిమా కోసం మరింత కష్టపడి కండలు పెంచబోతున్నాడు. బాక్సర్ గా పక్కా ట్రైనింగ్ తీసుకుని మరీ సెట్స్ పైకి రాబోతున్నాడు. హీరోలు కథను నమ్ముకోవడం కామన్.. కానీ వరుణ్ తేజ్ మాత్రం ఫోకస్ తను ప్లే చేసే క్యారెక్టర్ పై కూడా పెడుతున్నాడు.