వరుణ్ తేజ్ ఫిదా టీజర్ రిలీజ్ డేట్

Thursday,June 15,2017 - 07:02 by Z_CLU

వరుణ్ తేజ్ ఫిదా టీజర్ రిలీజ్ కి రెడీ అయింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఈ సినిమా టీజర్ ఈ నెల 17 న రిలీజవుతుంది.

శక్తికాంత్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్స్ తో పాజిటివ్ ఇంప్రెషన్ ని బ్యాగ్ లో వేసుకున్న ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్, ఇక ఈ టీజర్ తో టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ అనే అనిపిస్తుంది.