వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్

Friday,January 19,2018 - 12:07 by Z_CLU

‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. ఇప్పటి వరకు చేసిన 5 సినిమాల్లోనూ తనను తాను డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేసుకున్నాడు. ఏ ఇమేజ్ లేకుండా ఉండటమే పర్ఫెక్ట్ ఇమేజ్ అని బిలీవ్ చేసే వరుణ్ తేజ్, ప్రస్తుతం ‘తొలిప్రేమ’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. అయితే 1990 లో జనవరి 19 న జన్మించిన ఈ మెగా హీరో ఈ రోజు తన 28 వ పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా జీ సినిమాలు స్పెషల్ స్టోరీ…

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ముకుంద’ వరుణ్ తేజ్ ని పర్ఫెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేసింది. ఓ వైపు యాక్షన్ హీరోగా ప్రెజెంట్ చేస్తూనే డిఫెరెంట్ మ్యానరిజంతో తెరకెక్కిన ఈ సినిమా, ఫస్ట్ సినిమాతోనే మెగా ఫ్యాన్స్ లో క్రేజ్ క్రియేట్ చేసింది.

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘కంచె’ వరుణ్ తేజ్ ని డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేసింది. 1936 వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా, విమర్శకుల ప్రశంసలు పొందింది. వరుణ్ తేజ్ ఈ సినిమాలో దూపాటి హరిబాబుగా 100% ఇంప్రెస్ చేశాడు.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న వరుణ్ తేజ్ ని మాస్ హీరోగా ప్రెజెంట్ చేసింది ‘లోఫర్’ మూవీ. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ వరుణ్ తేజ్ రియల్ స్టామినాని ఎలివేట్ చేసింది.

 

‘లోఫర్’ లాంటి మాస్ ఎంటర్ టైన్ తరవాత రొమాంటిక్ హీరోగా కనిపించాడు వరుణ్ ‘మిస్టర్’ సినిమాలో. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఇమోషనల్ ఎంటర్ టైనర్ ఈ మెగా హీరోని యూత్ తో పాటు ఫ్యామిలీస్ కి మరింత దగ్గర చేసింది.

వరుణ్ తేజ్ నాలుగేళ్ళ కరియర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ నిలిచిన సినిమా ‘ఫిదా’. ఈ సినిమా క్రియేట్ చేసిన మ్యాజిక్ వరుణ్ తేజ్  కరియర్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ లవ్ ఎంటర్ టైనర్ వరుణ్ తేజ్ కి ఎండ్ లెస్ ఫ్యాన్ ఫాలోయిన్ క్రియేట్ చేసింది.

ప్రస్తుత వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘తొలిప్రేమ’ ఫిబ్రవరి 9 న రిలీజ్ కి రెడీ అవుతుంది. మెచ్యూర్డ్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా, ఇప్పటికే టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను ఎంచుకుంటూ కరియర్ ని ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేసుకుంటున్న వరుణ్ తేజ్ మరిన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని, ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది జీ సినిమాలు.