50 రోజుల తర్వాత సెట్స్ పైకి...

Monday,November 21,2016 - 02:20 by Z_CLU

వరుణ్ తేజ ఈమధ్యంతా పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయాడు. కాలికి పెద్ద దెబ్బ తగలడంతో కదల్లేని స్థితిలో ఇంట్లోనే ఉండిపోయాడు. మొన్న దీపాావళికి కూడా కూర్చొనే క్రాకర్స్ కాల్చాడు. అలా 50 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్న వరుణ్ తేజ, ఎట్టకేలకు మళ్లీ సెట్స్ పైకి వచ్చాడు. ఈరోజు నుంచి మిస్టర్ షూటింగ్ షెడ్యూల్ లో అడుగుపెట్టాడు వరుణ్ తేజ.

varun

శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ సినిమా షూటింగ్ దాదాపు 80శాతం కంప్లీట్ అయింది. సైమల్టేనియస్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమా కూడాా స్టార్ట్ చేశాాడు. అయితే యాాక్సిడెంట్ అవ్వడంతో షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాాయి. ఎట్టకేలకు పూర్తిగా కోలుకున్న వరుణ్ తేజ, మిస్టర్ సినిమా సెట్స్ పైకి వచ్చినట్టు ట్వీట్ చేశాడు.