వరుణ్ తేజ్ 'అంతరిక్షం' టీజర్ రివ్యూ

Wednesday,October 17,2018 - 04:39 by Z_CLU

వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ టీజర్ రిలీజ్ అయింది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి ‘ఘాజి’ లాంటి డిఫెరెంట్ ఎంటర్ టైనర్ తరవాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో న్యాచురల్ గానే ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తోడు వరుణ్ తేజ్ నుండి ‘తొలిప్రేమ’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఈ ‘అంతరిక్షం’.

టీజర్ లో ఏ మాత్రం స్టోరీ రివీల్ కాకుండా జాగ్రత్తపడ్డారు ఫిల్మ్ మేకర్స్. 0:57 సెకన్ల ఈ వీడియో లో టెక్నికల్ గా ఈ సినిమా స్టాండర్డ్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఎలివేట్ చేసింది సినిమా యూనిట్. 2000 KMPH వేగంతో అంతరిక్షం లోకి దూసుకెళ్ళిన ‘మిహిర’ స్యాటిలైట్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని తెలుస్తుంది.

ఇంతకీ ఏ మిషన్ పై ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి వెళ్ళారు..? అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి..? అనే క్వశ్చన్స్ రేజ్ చేస్తుందీ టీజర్. హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ‘అంతరిక్షం’, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

క్రిష్ జాగర్లమూడి, సాయి బాబు, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ఈ సినిమాకి ప్రశాంత్ విహారి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అదితి రావు హైదరి తో పాటు, లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.