పుట్టినరోజు నాడు కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు...

Thursday,January 19,2017 - 10:41 by Z_CLU

ఈరోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ పుట్టినరోజు. ఇప్పటికే 2 సినిమాలు చేస్తున్న ఈ హీరో, తన బర్త్ డే సందర్భంగా మరో సినిమా కూడా ఎనౌన్స్ చేశాడు. కొత్త కుర్రాడు వెంకీ అట్లూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాాద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. తేరి, కత్తి, రాజా రాణి లాంటి సినిమాలకు పనిచేసిన జార్జ్ సి విలియమ్స్, ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేయబోతున్నాడు.

ప్రస్తుతం ఫిదా, మిస్టర్ సినిమాల్లో నటిస్తున్నాడు వరుణ్ తేజ. శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమా తెరకెక్కుతుండగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాల్లో మిస్టర్ మూవీ దాదాపు పూర్తయింది. త్వరలోనే విడుదలకానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తాడు వరుణ్ తేజ.

వరుణ్ తేజ పుట్టినరోజును మెగా ఫ్యాన్స్ అంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ముకుంద సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ మెగా హీరో, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ తో కంప్లీట్ లవర్ బాయ్ గా కనిపించాడు.

varun-tej-birth-day-2