లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Thursday,February 28,2019 - 03:23 by Z_CLU

రామ్ గోపాల్ వర్మ డైరక్ట్ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసి మార్చి 22న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని మేకర్స్ ఎనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన ఘటనల్ని తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు వర్మ.

మరోవైపు ఈ సినిమా బిజినెస్ పై వస్తున్న పుకార్లపై కూడా ఆర్జీవీ రియాక్ట్ అయ్యాడు. బిజినెస్ గురించి వస్తున్న వార్తలు పుకార్లేనని నిర్మాతలు కొట్టిపారేసారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో రేట్ కి
కొన్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని ,ఎవరికి ఏ రేటుకి ఫైనల్ చేయబోతున్నారనే వివరాల్ని జి.వి ఫిలింస్, రామ్ గోపాల్ వర్మ మరియు రాకేష్ రెడ్డి లు త్వరలోనే తెలియజేస్తామన్నారు.

టెక్నీషియన్స్-

ఎ జివి ఆర్జీవి ఫిల్మ్స్ ప్రెజెంట్స్,
దర్శకత్వం :రాం గోపాల్ వర్మ & అగస్త్య మంజు
నిర్మాతలు :రాకేష్ రెడ్డి &దీప్తి బాలగిరి
సినిమాటోగ్రఫీ : రమ్మీ
రచన : రాం గోపాల్ వర్మ & నరేంద్ర చారి
మ్యూజిక్ : కళ్యాణ్ కోడూరి
ఎడిటర్ : కమల్ ఆర్
కాస్ట్యూమ్ డిజైనర్ : వెంకటేష్ జక్కుల
కొరియోగ్రఫీ : శంకర్ మాస్టర్
లిరిక్స్ : సిరా శ్రీ
పి ఆర్ ఓ : జి.ఎస్.కె మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూర్య చౌదరి
ప్రొడక్షన్ కంట్రోలర్ : పాండి
సౌండ్ డిజైన్ : యతి రాజు