విజయవాడలో వంగవీటి ఆడియో

Tuesday,November 29,2016 - 06:00 by Z_CLU

విజ‌య‌వాడలో ఒక‌ప్పుడు సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కొంత‌మంది వ్య‌క్తులు, కొన్ని సంఘ‌ట‌న‌లు ఆధారంగా రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమా చేయ‌బోతున్నాన‌ని అనౌన్స్ చేయ‌గానే సినిమాపై చాలా క్యూరియాసిటీ పెరిగింది. రామదూత‌ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుండి ప్రేక్ష‌కుల్లో చాలా ఇంట్రెస్ట్్ క్రియేట్ చేసింది. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేసిన వంగ‌వీటి ట్రైల‌ర్‌కు రెండు మిలియన్ వ్యూస్ వ‌చ్చాయి. ఈ సినిమా ఆడియో విడుదల కార్య‌క్ర‌మాన్ని గ్రాండ్‌గా విజ‌య‌వాడ‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

rgv

ఈ సంద‌ర్భంగా … చిత్ర ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మాట్లాడుతూ – “విజ‌య‌వాడ రౌడీయిజంపై నా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న `వంగ‌వీటి` నాకు చాలా ప్ర‌త్యేక‌మైన చిత్రం. అప్ప‌ట్లో అక్క‌డ జ‌రిగిన చాలా సంఘ‌ర్ష‌ణ‌ల‌కు నేను ప్ర‌త్య‌క్ష‌సాక్షిని. ఇప్ప‌టికే విడుద‌లైన‌ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు, సాంగ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.అలాగే ర‌వి శంక‌ర్ మ్యూజిక్‌లో రూపొందిన మిగిలిన పాట‌లు కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి. డిసెంబ‌ర్ 3న వంగవీటి ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వాడ‌లోని కోనేరు ల‌క్ష్మ‌య్య యూనివ‌ర్సిటీ గ్రౌండ్స్‌లో పలువురి ప్ర‌ముఖుల స‌మక్షంలో విడుద‌ల చేయ‌నున్నాం. ఇప్పుడు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబ‌ర్ 23న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.