మహేష్ తో సినిమా ఉంటుంది - వంశీ పైడిపల్లి

Tuesday,April 28,2020 - 12:39 by Z_CLU

అన్నీ అనుకున్నట్టు జరిగితే మహేష్-వంశీ పైడిపల్లి కలిసి ఈపాటికి సెట్స్ పైకి వెళ్లాలి. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ప్రాజెక్ట్ ఫైనలైజ్ కాలేదు. అయితే వంశీ పైడిపల్లి మాత్రం వెనక్కి తగ్గలేదు.

ఎప్పటికైనా మహేష్ తో మరో మూవీ చేస్తానంటున్నాడు ఈ దర్శకుడు. మహేష్ తో మూవీ అయితే ఉంటుందని, ప్రస్తుతానికి అంతకంటే ఎక్కువ చెప్పలేనని అంటున్నాడు పైడిపల్లి. అన్నీ కన్ ఫర్మ్ అయ్యాక అఫీషియల్ గా ప్రకటిస్తానంటున్నాడు.

మహేష్-వంశీ పైడిపల్లి కాంబోలో మహర్షి సినిమా వచ్చింది. మహేష్ కెరీర్ లోనే ప్రతిష్టాత్మక 25వ చిత్రం అది. ఆ సినిమా సక్సెస్ తో వంశీకి మరో ఆఫర్ ఇచ్చాడు మహేష్. కానీ సరైన కథ సెట్ అవ్వక, ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవ్వలేదు.