వాల్మీకి ట్రయిలర్ రివ్యూ.. సింప్లీ సూపర్బ్

Monday,September 09,2019 - 05:33 by Z_CLU

వరుణ్ తేజ్ మేకోవర్ తో వాల్మీకి మూవీపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు రిలీజైన ట్రయిలర్ తో ఆ అంచనాలు కాస్తా డబుల్-ట్రిపుల్ అయ్యాయి. అవును.. వాల్మీకి ట్రయిలర్ ఇనిస్టెంట్ హిట్ అయింది. వరుణ్ తేజ్ మేకోవర్ తోనే కాదు, డైలాగ్స్ తో కూడా ఆకట్టుకున్నాడు. ట్రయిలర్ లో చెప్పినట్టు గత్తరలేపాడు, చింపేశాడు.

రీమేక్ సబ్జెక్ట్స్ ను నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేయడంలో హరీష్ శంకర్ ఎక్స్ పర్ట్. గబ్బర్ సింగ్, డీజే సినిమాలతో అతడి టాలెంట్ చూశాం. ఇప్పుడు వాల్మీకితో హరీష్ విశ్వరూపం చూడొచ్చు. పేరుకు ఇది రీమేక్ ప్రాజెక్టు అయినప్పటికీ ఎక్కడా ఆ ఫీల్ లేకుండా, పక్కా మాస్ ఎలిమెంట్స్ తో అదరగొట్టింది ట్రయిలర్.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. హరీష్ శంకర్ మార్క్ క్రిస్టల్ క్లియర్ గా కనిపించింది. ట్రయిలర్ లోనే ప్రతి డైలాగ్ లో హరీష్ కనిపించాడు. “గవాస్కర్ సిక్స్ కొట్టుడు, బప్పిలహరి పాట కొట్టుడు, నేను బొక్కలు ఇరగ్గొట్టుడు సేమ్ టు సేమ్” అనే డైలాగ్ అయితే కిర్రాక్ ఉంది. వింటేజ్ లుక్స్ లో పూజా హెగ్డే కూల్ గా, అందంగా ఉంది.

గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి ఎపిసోడ్ తో ఆకట్టుకున్న హరీష్.. వాల్మీకిలో కూడా అలాంటి ప్రయత్నం చేసినట్టు ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. దీంతో పాటు అదిరిపోయే కామెడీ ఉందనే విషయం కూడా తెలుస్తూనే ఉంది. పనిలోపనిగా ట్రయిలర్ లోనే టైటిల్ పై జస్టిఫికేషన్ కూడా ఇచ్చాడు హరీష్. ఓవరాల్ గా వాల్మీకి ట్రయిలర్ అదిరిపోయింది. సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది.