వాల్మీకి ప్రీ-టీజర్.. వరుణ్ లుక్ అదిరింది

Monday,June 24,2019 - 05:51 by Z_CLU

వాల్మీకి సినిమాకు సంబంధించి టీజర్ రెడీ అవుతోంది. అంతకంటే ముందు ప్రీ-టీజర్ ను విడుదల చేశారు. ఇందులో కేవలం వరుణ్ తేజ్ లుక్ ను బయటపెట్టారు. ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించని విధంగా పక్కా మాస్ లుక్ లో వరుణ్ తేజ్ అదరగొట్టాడు.

తమిళ్ లో హిట్ అయిన జిగర్తాండా సినిమాకు రీమేక్ గా వస్తోంది వాల్మీకి. తమిళ్ లో బాబీ సిమ్హా చేసిన పాత్రను తెలుగులో వరుణ్ తేజ్ చేస్తున్నాడు. ఇది గ్రే షేడ్స్ తో సాగే పాత్ర. దానికి తగ్గట్టే ఫుల్ గా గడ్డం, మీసం, జుట్టు పెంచి రఫ్ గా కనిపిస్తున్నాడు వరుణ్ తేజ్.

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది వాల్మీకి సినిమా. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.