వాలంటైన్స్ డే స్పెషల్

Tuesday,February 14,2017 - 10:55 by Z_CLU

2016 బోలెడంత లవ్ ని స్ప్రెడ్ చేసింది. ఆన్ స్క్రీన్ అడోరబుల్ లవర్స్ ని కూడా జనరేట్ చేసింది. మనసుకు హత్తుకునే లవ్ స్టోరీస్ తో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీస్… ఆన్ స్క్రీన్ బెస్ట్ లవర్స్ ను క్రియేట్ చేసింది. ఈ వాలంటైన్స్ డే సందర్భంగా… టాలీవుడ్ లో రీసెంట్ ఆన్ స్క్రీన్ లవర్స్ ను చూద్దాం.
on-screen-_-1
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కరియర్ లో మైల్ స్టోన్ లా నిలిచింది నేను శైలజ. దానికి తోడు రామ్, కీర్తి సురేష్ న్యాచురల్ పర్ఫామెన్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. సినిమా రిలీజయ్యాక చాలామంది వాట్సప్ ప్రొఫైల్స్, ఫేస్ బుక్ ప్రొఫైల్స్ వీరిద్దరి ఇమేజెస్ తో నిండిపోయాయంటేనే ఈ ఆన్ స్క్రీన్ లవర్స్ చేసిన మ్యాజిక్ అర్థమైపోతుంది.

on-screen-_-2

మూడు డిఫెరెంట్ స్టేజెస్ లో సరికొత్తగా క్రియేట్ అయ్యే వండర్ ఫుల్ లవ్ జర్నీ ప్రేమమ్. ఈ సినిమాలో చైతు సరసన నటించిన ముగ్గురు ముద్దుగుమ్మలు… నాగచైతన్యకి పర్ ఫెక్ట్ ఆన్ స్క్రీన్ లవర్సే. కానీ మూవీలో కీలకమైన చైతూ-శృతిహాసన్ ల ఆన్ స్క్రీన్ బంధం మాత్రం ఎవర్ గ్రీన్.

on-screen-_-3
విజయ్ దేవరకొండ, రీతూవర్మ ఆన్ స్క్రీన్ లవ్ సైలెంట్ గానే బోలెడంత లవ్ ఎసెన్స్ ని స్ప్రెడ్ చేసింది. ఏ మాత్రం హడావిడి లేకుండా న్యాచురల్ గా మెస్మరైజ్ చేసిన ఈ లవ్ జోడి…. ప్రేమించే ప్రతి మనసును రీచ్ అయింది.

on-screen-_-4

అసలే లవర్ బాయ్ ఇమేజ్. నితిన్ పక్కన ఏ హీరోయిన్ నటించినా మ్యాచ్ అయిపోతుంది. అలాంటిది బబ్లీ లుక్స్ తో , నాటీ పర్ఫామెన్స్ తో పడేసే సమంతాని హీరోయిన్ గా జత చేస్తే ఏం జరుగుతుంది. ఆన్ స్క్రీన్ పెద్ద సైజు ఫైర్ జెనెరేట్ అయింది… ఆ లవ్ జోడి సెట్ చేసిన ఫీవర్… ఇప్పటికీ ప్రేమికుల మైండ్ లో తిరుగుతూనే ఉంది.

on-screen-_-5
న్యాచురల్ స్టార్.. అందునా లవ్ స్టోరీ.. మామూలు క్యారెక్టర్ నే చించేసే రకం. అలాంటి మజ్ను కి అనూ ఇమ్మాన్యువెల్ లాంటి హీరోయిన్ జత కడితే ఏముంది…? పర్ ఫెక్ట్ లైలా అనిపించుకుంది. అసలు మజ్ను టైటిల్ కింద.. డోన్ట్ డ్రింకింగ్.. స్టార్ట్ లవింగ్ అనే క్యాప్షన్ కే చాాలామంది పడిపోయారు. తర్వాత స్కీన్ పై నాని-అను కాంబో చూసి ఫ్లాట్ అయిపోయారు.
on-screen-_-6
అల్లు శిరీష్ లోని మెగా ట్యాలెంట్ ని ఎలివేట్ చేసిన అల్టిమేట్ లవ్ ఎంటర్ టైనర్ శ్రీరస్తు శుభమస్తు. ఈ సినిమాతో మెస్మరైజింగ్ లవర్ బాయ్ గా డిగ్రీ కొట్టేసిన శిరీష్, లావణ్య త్రిపాఠి ఆన్ లైన్ కెమిస్ట్రీ… ఏ ఆంగిల్ లో చూసినా అల్టిమేట్ అనిపించుకుంది. ఈ ఆన్ స్క్రీన్ లవర్స్ సినిమా రిలీజైన రోజు నుండే శ్రీరస్తు శుభమస్తు అంటూ బోలెడన్నీ లవ్ బ్లెస్సింగ్స్ ని బ్యాగ్ లో వేసుకున్నారు.
on-screen-_-7
2017 బిగినింగ్ లోనే సరికొత్త యాటిట్యూడ్ తో కావాల్సినంత లవ్ ని జెనెరేట్ చేశాడు నాని. ఆన్ స్క్రీన్ సిజిలింగ్ కెమిస్ట్రీతో ఎట్రాక్ట్ చేసిన బాబు, కీర్తిల లవ్ మ్యాజిక్… సినిమా చూసిన ప్రతి ఒక్కరిని మ్యాగ్జిమం లవ్ లో పడేసింది. 2017 లో బహుశా బాబు, కీర్తిల కన్నా బెస్ట్ లవర్స్ ఇప్పట్లో మళ్ళీ స్క్రీన్ పై కనబడరేమో అనిపించేలా మాయచేశారు ఈ ఆన్ స్క్రీన్ లవర్స్.

ప్రపంచంలో దేనికైనా పాత కొత్త… ఎక్కువ తక్కువా అనే మేజర్ మెంట్స్ ఉంటాయి ఒక్క లవ్ కి తప్ప. అందుకే లవ్ ఉన్నచోట ప్రతి ఒక్కరి లైఫ్ లోను బోలెడన్నీ కలర్స్ నిండుకుంటాయి. అందుకే ఈ స్పెషల్ డే రోజు బోలెడంత లవ్ తో… వాలెంటైన్స్ డే విషెస్ తెలియజేస్తుంది మీ జీ సినిమాలు.