నాపేరు సూర్య దర్శకుడితో మాస్ మహారాజ్

Saturday,March 14,2020 - 11:39 by Z_CLU

అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు కథా రచయిత వక్కంతం వంశీ. మళ్లీ ఇన్నేళ్లకు ఈ దర్శకుడు తన రెండో సినిమా రెడీ చేశాడు. ఈసారి మాస్ మహారాజ్ రవితేజతో మూవీ ప్లాన్ చేశాడు.

తన తొలి సినిమాకు సీరియస్ సబ్జెక్ట్ ఎంచుకున్న వక్కంతం.. తన రెండో సినిమాకు మాత్రం ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ రాసుకున్నాడు. మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ ఫన్ ఉండే సినిమా ఇది. వక్కంతం వంశీ చెప్పిన స్టోరీలైన్ కు రవితేజ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు.

ప్రస్తుతం క్రాక్ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఆ మూవీ కంప్లీట్ అయిన వెంటనే వక్కంతం మూవీ సెట్స్ పైకి వస్తుంది. హీరోయిన్, నిర్మాత ఎవరనే విషయాన్ని ఉగాదికి అఫీషియల్ గా ప్రకటిస్తారు.