ఇది మామూలు రేసుగుర్రం కాదు...

Wednesday,November 23,2016 - 05:01 by Z_CLU

రేసుగుర్రం అనే పేరుచెప్పగానే గుర్తొచ్చేది బన్నీనే. ఇప్పుడీ టైటిల్ బన్నీ కెరీర్ ను కూడా అప్లయ్ అయిపోతుంది. ఎందుకంటే.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే డీజే మూవీని సెట్స్ పైకి తీసుకొచ్చిన అల్లువారబ్బాయ్… త్వరలోనే లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ముచ్చటగా ఇప్పుడు మూడో సినిమా కూడా ఎనౌన్స్ చేశాడు.

bunny-vakkantham

వక్కంతం వంశీ దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు బన్నీ. హరీశ్ శంకర్, లింగుస్వామి సినిమాలు పూర్తయిన వెంటనే.. వక్కంతంతో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు. లగడపాటి శ్రీధర్, నాగబాబు కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. రేసుగుర్రం సినిమాకు వక్కంతం వంశీనే కథ అందించాడు. ఇప్పుడు బన్నీ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.