#Vakeelsaab - మార్పులతో మెప్పించిన డైరెక్టర్

Saturday,April 10,2021 - 01:52 by Z_CLU

పింక్ సినిమాను పవన్ కళ్యాణ్ తో తీస్తున్నారు అనే వార్త బయటికొచ్చినప్పటి నుండి సినిమా చుట్టూ అనేక ప్రశ్నలు. అసలు పవన్ కళ్యాణ్ తన కం బ్యాక్ సినిమాకి ఆ కథ ఎంచుకోవడానికి కారణం ఏమిటి ? దిల్ రాజు పవన్ తో ఈ సినిమా నిర్మించడం ఏమిటి ? శ్రీరామ్ వేణు ఈ రీమేక్ తో పవన్ అభిమానులను మెప్పిస్తాడా ? ఇలా ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి.

కానీ ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ మన ఆడియన్స్ కి నచ్చేలా ముఖ్యంగా పవన్ అభిమానులను మెప్పించేలా తీస్తున్నామని ఎప్పటికప్పుడు చెప్తూనే వచ్చారు మేకర్స్.

pawan kalyan vakeel saab movie stills

రిలీజ్ కి ముందు కూడా సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో మీటర్ తో సహా చెప్పారు నిర్మాత దిల్ రాజు. కానీ పవన్ అభిమానుల్లో మాత్రం నిన్నటివరకూ ఈ రీమేక్ పై కొన్ని సందేహాలు ఉన్నాయి. నిన్నతో ఆ సందేహాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు ‘వకీల్ సాబ్’.

బెనిఫిట్ షో చూసిన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా సినిమా మెప్పించి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ‘వకీల్ సాబ్’ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన సినిమా అని నిన్నటి వరకూ ఊహించని అభిమానులు సైతం సినిమా చూసి ఫిదా అయ్యారు. ముఖ్యంగా పవన్ నుండి కోరుకునే అదిరిపోయే ఫైట్స్ , మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పాటలు , పవర్ ఫుల్ డైలాగులు సినిమాలో ఉండేసరికి సప్రయిజ్ అయ్యారు. ముఖ్యంగా కథలో ఉన్న సోల్ మిస్ అవ్వకుండా దర్శకుడు చేర్చిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఫ్యాన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

pawan kalyan vakeel saab movie stills

మూడేళ్ళ తర్వాత అభిమానులు పవన్ ని స్క్రీన్ పై ఎలా చూడాలనుకున్నారో సరిగ్గా తన మార్పులతో ఓ అభిమానిగా అలాగే చూపించాడు శ్రీరామ్ వేణు.

దీంతో తమ అభిమాన హీరోతో ఓ మంచి సినిమా తీసి బ్లాక్ బస్టర్ గా తీర్చిదిద్దిన డైరెక్టర్ శ్రీరామ్ వేణుని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పవన్ ఫ్యాన్స్. ఏదేమైనా ఈ రీమేక్ తో మళ్ళీ ప్రేక్షకులను మెప్పించడం, అదీ పవర్ స్టార్ ని పెట్టి కొన్ని మార్పులతో రిస్క్ చేయడం, ఇవన్నీ కత్తి మీద సాము లాంటి వ్యవహారం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎంతో జాగ్రత్తగా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. అందుకే ఇప్పుడు అభిమానుల నుండి అభినందనలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీరామ్ వేణు త్వరలోనే అల్లు అర్జున్ తో ‘ఐకాన్’ సినిమా చేయబోతున్నాడు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics