VakeelSaab Trailer - పవనిజం పీక్స్

Monday,March 29,2021 - 06:41 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి సిసలైన హంగామా మొదలైంది. కొద్దిసేపటి కిందట వకీల్ సాబ్ ట్రయిలర్ రిలీజైంది. ట్రయిలర్ లో పవనిజం పీక్స్ లో కనిపించింది. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ స్క్రీన్ పైకొచ్చిన పవన్ లో అదే గ్రేజ్, అదే స్టయిల్.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. సినిమా ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుందనే విషయం తెలుస్తోంది. అంజలి, నివేత థామస్, అనన్యకు ఏమైంది.. వాళ్ల కేసును వకీల్ సాబ్ ఎలా వాదించాడనేది ఈ సినిమా కథ.

పింక్ సినిమాకు రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ లో కొత్తగా చాలా యాడ్ చేశారనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం లైన్ మాత్రమే తీసుకొని, పవన్ ఇమేజ్, క్రేజ్ కు తగ్గట్టు ఫైట్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ యాడ్ చేశారు. పవన్ క్యారెక్టరైజేషన్ కూడా మార్చారు. అయితే ఆ ఛాయల్ని ట్రయిలర్ లో చూపించలేదు. పింక్ సినిమాకు ఒరిజినల్ రీమేక్ అన్నట్టుగానే ట్రయిలర్ ఉంది. కానీ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. అసలు మేటర్ దాచేశారు.

vakeel saab stills pawan kalyan

ఇక సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ కు కూడా ట్రయిలర్ లో చోటివ్వలేదు. అంటే, ఆమె ఎప్పీయరెన్స్, క్యారెక్టర్ ను కూడా సస్పెన్స్ లో ఉంచారన్నమాట.

మొత్తంగా చూసుకుంటే.. ట్రయిలర్ లో పవన్ ప్రజెన్స్ తర్వాత పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎట్రాక్ట్ చేశాయి. ట్రయిలర్ తోనే సగం హిట్ కొట్టేసిన వకీల్ సాబ్.. ఇక థియేటర్లలో రఫ్ఫాడించడమే ఆలస్యం.