Vakeel Saab - క్లారిటీ రానుందా

Thursday,October 15,2020 - 02:13 by Z_CLU

అన్నీ అనుకున్నట్లు జరిగితే PowerStar రీ ఎంట్రీ ఇస్తున్న ‘Vakeel Saab’ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసేది. కానీ లాక్ డౌన్ కారణంగా బ్యాలెన్స్ షూటింగ్ వాయిదా పడటం , థియేటర్స్ కూడా మూతపడటంతో సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు Pawan Fans. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్స్ లోకి రానుందనే ప్రచారం జరుగుతుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంటుంది.

అయితే ఈ నెల దసరా రోజు Vakeel Saab నుండి ఫ్యాన్స్ కి ఓ గిఫ్ట్ రానుంది. విజయదశమి సందర్భంగా సినిమా టీజర్ ను రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తున్నారు. ఈ టీజర్ ఎండింగ్ లో రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినబడుతుంది.

సో Vakeel Saab Release పై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. BoneyKapoor తో కలిసి DilRaju నిర్మిస్తున్న ఈ సినిమాకు Venu Sriram దర్శకత్వం వహిస్తుండగా Thaman మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.