Vakeel Saab - వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Friday,April 09,2021 - 10:02 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి టాక్ కూడా వచ్చేసింది. ఏపీ, నైజాంలో ఉదయం 4 గంటల నుంచే షోలు ప్రారంభం అవ్వడంతో.. టాక్ ఏంటనేది వెంటనే బయటకొచ్చింది.

ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం.. వకీల్ సాబ్ సినిమాను బ్లాక్ బస్టర్ గా చెబుతున్నారు. మరికొన్ని ఏరియాస్ నుంచి ఇంకా టాక్ రావాల్సి ఉంది. అటు ఓవర్సీస్ నుంచి క్లియర్ టాక్ వచ్చేసింది. ఈ సినిమాను పవన్ కల్యాణ్ కు పెర్ ఫెక్ట్ రీఎంట్రీ మూవీగా చెబుతున్నారు.

ప్రస్తుతం థియేటర్లలో వకీల్ సాబ్ జాతర నడుస్తోంది. రికార్డ్ స్థాయిలో షోలు పడుతున్నప్పటికీ.. ప్రతి షో హౌజ్ ఫుల్ అవుతోంది. ఈ వీకెండ్ మొత్తం ఇదే ట్రెండ్ కొనసాగడం గ్యారెంటీ. ఎందుకంటే, అడ్వాన్స్ బుకింగ్ లోనే దాదాపు 90శాతం టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

ఏళ్లు గడిచినా, సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్నా, పవర్ స్టార్ స్టామినా, అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని వకీల్ సాబ్ రుజువు చేసింది. సినిమా థియేటర్లలోకి వచ్చేయడంతో ఇప్పుడు అందరి చూపు ఫస్ట్ డే కలెక్షన్ పై పడింది. ఈరోజు రాత్రికే ఫస్ట్ డే కౌంట్ తెలిసిపోతుంది. ఎఁదుకంటే, అడ్వాన్స్ బుకింగ్ ఆ రేంజ్ లో జరిగింది. కౌంటర్ సేల్ కూడా దాదాపు పూర్తయింది.

  • vakeel saab stills

ఇప్పటికే ట్రయిలర్, లిరికల్ సాంగ్స్ తో రికార్డుల మీద రికార్డులు సృష్టించింది వకీల్ సాబ్. అలా డిజిటల్ రికార్డులకు ఫుల్ స్టాప్ పెట్టిన ఈ సినిమా, ఇప్పుడు థియేట్రికల్ రికార్డులపై కన్నేసింది. ఫస్ట్ డే వసూళ్ల నుంచి ప్రారంభం కాబోతున్న వకీల్ సాబ్ రికార్డుల పరంపర ఎంత దూరం వెళ్తుందనేది చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో బాహుబలి-2, అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఆల్ టైమ్ హిట్స్ గా ఉన్నాయి. వీటి సరసన వకీల్ సాబ్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics