Vakeel Saab - మరో 3 రోజుల్లో సునామీ!

Tuesday,April 06,2021 - 10:46 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు అఫీషియల్ కౌంట్ డౌన్ మొదలైంది. నిన్న ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తవ్వడంతో రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. ఇందులో భాగంగా మరో 3 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

అజ్ఞాతవాసి తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని పవర్ స్టార్ చేస్తున్న సినిమా ఇది. పైగా హిందీ-తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్టయిన పింక్ సినిమాకు రీమేక్ గా ఇది వస్తోంది. సాంగ్స్, ట్రయిలర్స్ ఇప్పటికే పెద్ద హిట్టయ్యాయి. అందుకే వకీల్ సాబ్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి.

ఇప్పటికే సినిమా అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయింది. ఇలా తెరవగానే అలా క్షణాల్లో టిక్కెట్లు అన్నీ అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ బట్టి చూస్తుంటే.. ఫస్ట్ డే కలెక్షన్లలో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించేలా ఉంది.

ఏపీ, నైజాంలో బెనిఫిట్ షోలకు అనుమతి వస్తే వకీల్ సాబ్ మూవీ కలెక్షన్లలో భారీ రికార్డులు సృష్టించడం ఖాయం. వేణుశ్రీరామ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress’s Gallery and interesting topics