వకీల్ సాబ్ కొత్త ప్లాన్ ఇదే

Sunday,August 02,2020 - 02:02 by Z_CLU

వాక్సీన్ వచ్చేంతవరకు సెట్స్ పైకి రానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించాడు. దీంతో వకీల్ సాబ్ యూనిట్ ప్లాన్ మార్చింది. సెప్టెంబర్, అక్టోబర్ లో కొత్త షెడ్యూల్స్ కు రెడీ అవుతోంది.

న్యూ ప్లాన్ ప్రకారం.. సెప్టెంబర్ లో వకీల్ సాబ్ కొత్త షెడ్యూల్ ప్రారంభమౌతుంది. కానీ అందులో పవన్ కల్యాణ్ ఉండడు. పవన్ తో సంబంధం లేని సీన్స్ ను మిగతా ఆర్టిస్టులతో పూర్తిచేస్తారు

ఇక అక్టోబర్ లో అసలు షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. పవన్ తో సన్నివేశాల్ని అక్టోబర్ లో ప్లాన్ చేశారు. అప్పటికి అందుబాటులో ఉన్న హీరోయిన్ ను తీసుకొని.. ఆ హీరోయిన్ కు, పవన్ కు మధ్య ఫ్యామిలీ ఎపిసోడ్ ఒకటి పూర్తిచేస్తారు.

అయితే ఇదంతా బేసిక్ ప్లాన్ మాత్రమే. అక్టోబర్ కు కూడా పరిస్థితులు చక్కబడకపోతే.. సినిమా మరింత ఆలస్యం అవుతుంది. ఒకవేళ అక్టోబర్ కు షూట్ కంప్లీట్ అయితే.. సినిమా సంక్రాంతికొస్తుంది.