Vakeel Saab - మరికొన్ని గంటల్లో చరిత్ర సృష్టించబోతోంది

Thursday,April 08,2021 - 02:33 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి మొదటి రోజు కళ్లు చెదిరే వసూళ్లు రాబోతున్నాయి. ఆల్రెడీ థియేటర్లలో టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఇదేదో మొదటి రోజుకు మాత్రమే కాదు, టోటల్ ఫస్ట్ వీకెండ్ కు సంబంధించి ఏపీ, నైజాంలో 90శాతం టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

ట్రేడ్ అంచనా ప్రకారం.. ఫస్ట్ డే వసూళ్లలో వకీల్ సాబ్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఎందుకంటే, హయ్యస్ట్ థియేటర్లు దక్కడంతో పాటు.. బెనిఫిట్ షోస్, టిక్కెట్ హైక్స్ కలుపుకుంటే వకీల్ సాబ్ రికార్డులు ఆల్రెడీ ఫిక్స్ అనే విషయం అర్థమౌతోంది.

ఏపీ, నైజాంలో ఈ సినిమాకు హయ్యస్ట్ థియేటర్లు దక్కాయి. పర్సంటేజీ ప్రకారం చూసుకుంటే.. దాదాపు 65శాతం థియేటర్లు వకీల్ సాబ్ కే కేటాయించారు. ఒక్క హైదరాబాద్ లోనే రేపు 800 షోలు పడబోతున్నాయి. నైజాం అంతటా రేపటికి అదనంగా మరో 400 షోలు ప్లాన్ చేశారు. అలా నైజాంలోనే బిగ్గెస్ట్ ఎవర్ రిలీజ్ గా రికార్డ్ సృష్టించబోతోంది వకీల్ సాబ్ సినిమా.

అటు బెనిఫిట్ షోలు, మిడ్ నైట్ షోలపై కూడా క్లారిటీ వచ్చేసింది. హైదరాబాద్ తో పాటు నైజాంలో రేపు ఉదయం 4 గంటల నుంచే షోలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు టిక్కెట్లు కూడా అమ్ముడుపోయాయి. యావరేజ్ గా ఒక్కో టిక్కెట్ 800 రూపాయల నుంచి 1500 రూపాయల మధ్య అమ్ముడుపోయింది. ఫస్ట్ డే కలెక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి ఇదొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే.

అటు ఓవర్సీస్ లో కూడా హెవీ బజ్ నడుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఫుల్ అవ్వగా.. ఇంట్రెస్ట్ పర్సంటేజీ ఆధారంగా థియేటర్లు షో కౌంట్ ను పెంచుతున్నాయి. ఇప్పటికే లాస్ ఏంజెల్స్, న్యూ జెర్సీ లాంటి ప్రాంతాల్లో ఎక్స్ ట్రా షోలకు కూడా టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న వకీల్ సాబ్ సినిమా వరల్డ్ వైడ్ రికార్డ్ ఓపెనింగ్స్ సాధించడం పక్కా. కౌంట్ డౌన్ క్లైమాక్స్ కొచ్చింది. హిస్టరీని కళ్లారా చూడ్డమే మిగిలింది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics